Tuesday, January 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో ఆగ‌ని మైనార్టీల హ‌త్య‌లు

బంగ్లాదేశ్‌లో ఆగ‌ని మైనార్టీల హ‌త్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన‌ హిందువుల హత్యలు ఆగడం లేదు. సోమీర్ కుమార్ అనే ఆటో డ్రైవ‌ర్ పై దాడి మూక దాడి జ‌రిగింది. దాస్‌ను కొట్టి, ఆపై కత్తితో పొడిచి చంపారు.ఆ తర్వాత మృతుని ఈ-ఆటో రిక్షాతో దుండ‌గులు పారిపోయారు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిందితుల్ని గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. మండలి, దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మైనారిటీలపై హింసాత్మక దాడులు ఎక్కువయ్యాయి.

బంగ్లా తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ ఈ మారుణకాండను అడ్డుకోవడం లేదు. బంగ్లాదేశ్‌లోని తీవ్రవాదులు మైనారిటీలపై, వారి ఇళ్ళు, సంస్థలు, వ్యాపార సంస్థలపై ఆందోళనకరమైన దాడులను మేము చూస్తూనే ఉన్నాము. ఇటువంటి మత సంఘటనలను త్వరగా మరియు దృఢంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -