– నేలకొరిగిన పైర్లు
– ఎకరానికి పంట నష్టం రూ.30వేలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– ఐలాపురంలో పంటల పరిశీలన
నవతెలంగాణ- మిర్యాలగూడ
అకాల వర్షంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామ శివారులోని పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నేలకొరిగిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వేలాది ఎకరాల పంట నేలకొరిగిందని తెలిపారు. రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు సాగు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఎకరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు అకాల వర్షాలతో పంటంతా దెబ్బతిన్నదని అన్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాలలో పత్తి, వరి, ఇతర పంటలు దెబ్బతిన్నా యన్నారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి పరిశీలించాలని, పంట నష్టం అంచనాలు రూపొందించి రైతులను ఆదుకోవా లని సూచించారు. ఈ పర్యటనలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మూడవత్ రవినాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, కోట శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయన్న, హనుమనాయక్, చిన్న సాయన్న, నాగేశ్వర్ రావునాయక్, వెంకటేశ్వర్లు, కృష్ణ తదితరులు ఉన్నారు.
అకాల వర్షాలతో తిప్పలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



