జనం నిజం తెలుసుకుంటున్నారు
మళ్లీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు
కలిసి పని చేద్దాం…స్థానిక సంస్థల్లో జెండా ఎగురేద్దాం : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్‌రెడ్డి అలవికాని హామీలతో అందలమెక్కి అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ప్రజలు నిజం తెలుసుకుం టున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మెదక్ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్, బీఆర్‌ఎస్ రావాలని కోరుకుంటున్నారనీ, అందరం కలిసి పని చేసి స్థానిక సంస్థల్లో జెండా ఎగురేద్దామని పిలుపునిచ్చారు. మెదక్ కలను కేసీఆర్ నిజం చేశారని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధు ఇస్తే, రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య మాత్రమే రైతుబంధు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైనా మోటార్లు ఆన్ చేయకుండా 65 టీఎంసీలు వినియోగించుకుండా, కాళేశ్వరం నీళ్లు మెదక్ వస్తాయన్న వినిపించుకోకుండా అబద్ధాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణ నీళ్లు తీసుకుపోతుంటే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. పాలన చేతకాక మోటర్లు ఆన్‌చేసి నీళ్ళు ఇవ్వక అబద్ధాలు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
అలవికాని హామీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES