నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
అర్బన్ ఫారెస్ట్ రెండు సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని జిల్లాల గడ్డ గ్రామంలో అర్బన్ ఫారెస్ట్ కి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు వచ్చేలా ప్రతిపాదనలు పెడుతున్నామన్నారు.అర్బన్ ఫారెస్ట్ కి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఎన్నికల వల్ల ఆగిపోయిందన్నారు.అర్బన్ ఫారెస్ట్ పార్క్ హైదరాబాద్ లేదా పెద్ద పెద్ద మున్సిపాలిటీ లకు వస్తాయని అలాంటిది హుస్నాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు.జిల్లలగడ్డ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.త్వరలోనే హుస్నాబాద్ అడవులకు వెళ్లాలని హైదరాబాద్ వాళ్ళు ఇక్కడకి రావాలన్నారు. ఒకసారి చూసి వెళ్ళిన వారు బయట వాళ్ళకి చెప్తే మరింత మంది ఇక్కడికి వస్తారనీ.. ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ చరిత్ర ,పోర్టు ఉందని అడవిలో రాజుల చరిత్ర ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయన్నారు. హిస్టరీ కల్చర్ అంతా ఫారెస్ట్ లోనే దొరుకుతుందన్నారు. అర్బన్ ఫారెస్ట్ కి వాచ్ టవర్ వస్తుందన్నారు. చిల్డ్రన్ ప్లే గేమ్స్ ఆడుకోవడానికి వస్తారన్నారు. జిల్లలగడ్డ వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందుతుందని అన్నారు .హుస్నాబాద్ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
అర్బన్ ఫారెస్ట్ రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



