Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ సొసైటీలో అందుబాటులోకి యూరియా

మద్నూర్ సొసైటీలో అందుబాటులోకి యూరియా

- Advertisement -

బయోమెట్రిక్ ద్వారా రైతులకు ఎకరానికి ఒక బ్యాగు పంపిణీ..
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ సొసైటీలో యూరియా మందు అందుబాటులో ఉందని కార్యదర్శి బాబురావు పటేల్ సోమవారం రైతులకు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఎకరానికి ఒక బ్యాగు చొప్పున బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అవసరము గల రైతులు తమ పట్టా పాస్బుక్కు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు. యూరియా మందు బ్యాగు ధర రూ.266కు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రైతులు సింగిల్ విండోకు వచ్చి తీసుకు వెళ్ళవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సొసైటీ సిబ్బంది విట్టల్, సునీల్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -