- Advertisement -
భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రైతులు యూరియాను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి కోరారు. శనివారం రైతులు ఈ రబీ సీజన్లో తమ పంట అవసరాలకు కావలసిన యూరియా కొరకు మొబైల్ యాప్ ద్వారా మీకు దగ్గరలోని ఫెర్టిలైజర్ షాప్ లలో బుక్ చేసుకొనడానికి మాత్రమే అవకాశం కలదని, రైతులందరూ తప్పని సరిగా అప్ ద్వారా బుకింగ్ చేసుకొనవలసినదిగా తెలుపుతూ రైతులందరికీ ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాసిల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, జి పి ఓ లు పాల్గొన్నారు.
- Advertisement -



