Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతాంగానికి యూరియాను వెంటనే సరఫరా చేయాలి 

రైతాంగానికి యూరియాను వెంటనే సరఫరా చేయాలి 

- Advertisement -

మండలానికి రావలసిన ఆరువేల మెట్రిక్ టన్నులు 
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ 
నవతెలంగాణ – బల్మూరు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం ఎరువులను యూరియాను ఇవ్వాలని మండల రైతాంగానికి యూరియా, ఎరువులను వెంటనే సరఫరా చేయాలని మండల కార్యదర్శి శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురువారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ముఖ్య కార్యకర్తల సమావేశం  జరిగింది. ఆయన మాట్లాడుతూ.. యూరియా సకాలంలో సరఫరా చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు సకాలంలో రావడంతో వరి నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని  జిల్లాల్లో సహకార సంఘాలు, డీలర్ షాపుల దగ్గర రైతులు బారులు తీరారని ప్రచారం వ్యక్తం చేశారు. 

సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవ కేంద్రాలు నానో ఏరియా బాటిల్స్ కొంటేనే యూరియా ఇస్తామని రైతులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు  తీసుకోవాలన్నారు. బలుమూరు మండలానికి 20వేల మెట్రిక్ టన్నుల యూరియా వాన కాలంలో అవసరమైతే ఇప్పటికీ 1344 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే వచ్చిందని ఇంకా నెలలో 600 పైచిలుకు మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని తెలిపారు. రైతులు యూరియా కోసం పడిగాపులు కాయకుండా ప్రభుత్వం సరఫరా చేసి రైతాంగానికి సకాలంలో అందించి సేద్యానికి దోహదపడాలని వారు కోరారు. ఈ కొరతను అదునుగా చూపించి అనేకమంది డీలర్లు 40 కిలోల యూరియా బస్తాకు రూ.267  ఉండగా అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు ఎండి లాల్ మహమ్మద్ ఆంజనేయులు బాలిశ్వరయ్య, రాధాకృష్ణ, మాసయ్య, బాలయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad