- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం మరియు ఇతర అంశాలపై చర్చల కోసం ట్రంప్ రాయబారి విట్కాఫ్ ఈ వారం యూరప్ వెళ్లనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ప్రకటించారు. పాలస్తీనా భూభాగంలో కాల్పుల విరమణ కోసం విట్కాఫ్ ఒత్తిడిని కొనసాగిస్తారని అన్నారు. విట్కాఫ్ బుధవారం రోమ్‌కు వెళతారని, ఇజ్రాయిల్ వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి రాన్ డెర్మెర్ మరియు ఖతార్ సీనియర్ రాయబారితో సమావేశం కోసం గురువారం యూరప్ చేరుకుంటారని స్థానిక మీడియా తెలిపింది. చర్చల్లో పురోగతి సాధిస్తే.. ఈ వారం చివరలో ఒక ఒప్పందాన్ని కుదర్చుకునే అవకాశం ఉందని పేర్కొంది.
- Advertisement -