Thursday, September 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవడ్డీ రేట్లను 0.25 పాయింట్లు తగ్గించిన అమెరికా ఫెడ్‌

వడ్డీ రేట్లను 0.25 పాయింట్లు తగ్గించిన అమెరికా ఫెడ్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుండి పెరుగుతున్న ఒత్తిడి, ఉద్యోగ గణాంకాల క్షీణతతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను బుధవారం 0.25శాతం తగ్గించింది. గతేడాది డిసెంబర్‌ తర్వాత ఫెడ్‌ నుండి ఇదే మొదటి వడ్డీ రేట్ల తగ్గింపు. దీంతో వడ్డీ రేట్లు 4-4.25శాతానికి పరిమితమయ్యాయి. ఈ ఏడాది మరో రెండు సార్లు, 2026లో మరోసారి రేట్లను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల తగ్గుదల అంచనా వేసిన దానికంటే మరింత ఎక్కువ, వేగంగా ఉండవచ్చని పెట్టుబడిదారులు అంచనా వేశారు.

ద్రవ్యోల్బణం, ఆర్థికవ్యవస్థపై టారిఫ్‌ల ప్రభావం, కఠినమైన వలసదారుల చట్టాలు, ఇతర ట్రంప్‌ యంత్రాంగం చేపడుతున్న విధానాల ప్రభావం అంచనా వేసినపుడు చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ నేతృత్వంలోని ఫెడ్‌ వడ్డీరేట్లను మార్చలేదు. ఇటీవల నియామకాలు దాదాపు ఆగిపోవడం, నిరుద్యోగిత రేటు అధికంగా ఉండటంతో, ఫెడ్‌ దృష్టి ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగాలపై మళ్లింది. ఇది 2శాతం కన్నా తక్కువగా ఉంది. వడ్డీ రేట్లు తగ్గించడంతో కారురుణాలు, వ్యాపార రుణాలు, తనఖాల కోసం ఖర్చులు తగ్గుతాయి. వృద్ధిరేటు, నియామకాలు పెరగవచ్చని పావెల్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -