నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన ‘గోల్డ్ కార్డు’ విక్రయాలను అధికారికంగా బుధవారం ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు ద్వారా ఒక మిలియన్ డాలర్లు చెల్లించిన వ్యక్తులకి అమెరికా పౌరసత్వం, చట్టపరమైన హోదా పొందే అవకాశం ఉంది. బుధవారం వైట్‌హౌస్ రూజ్‌వెల్ట్ రూమ్‌లో పారిశ్రామిక నేతలతో ఉన్న సమయంలో.. ఈ గ్రీన్ కార్డు దరఖాస్తుల్ని స్వీకరించే వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ గోల్డ్ కార్డు ఇబి-5 వీసాలను భర్తీ చేయనుంది. 1990లో విదేశీ పెట్టుబడి కోసం… అమెరికన్ కాంగ్రెస్ ఇబి-5 వీసాలను రూపొందించింది. ఇది సంపన్నుల కోసమే సృష్టించడం జరిగింది. కనీసం పది మంది ఉద్యోగులను నియమించే కంపెనీలో ఒక మిలియన్ డాలర్లు ఖర్చు చేసే వారికి ఇది అందుబాటులో ఉండేది. అమెరికాలో అత్యున్నత ప్రతిభావంతుల్ని నిలుపుకోవడానికి, ప్రభుత్వానికి ఆదాయం రావడానికి ఈ గోల్డ్ కార్డు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయడుతున్నారు. గతంలో ఈ గ్రీన్ కార్డు 5 మిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే ట్రంప్ దీన్ని 1-2 మిలియన్లకే పొందేలా సవరించారు.
కాగా, ఈ గోల్డ్‌కార్డు ప్రారంభించిన సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ కార్డులు పొందేవారిలో చైనా, భారత్, ఫ్రాన్స్‌లకు చెందిన యుఎస్ అగ్రశ్రేణి కాలేజీల్లో గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కంపెనీలు చాలా సంతోషంగా ఉన్నాయి’ అని ఆయన అన్నారు.
గోల్డ్ కార్డును ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



