- Advertisement -
న్యూఢిల్లీ : భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలను కొనసాగించే క్రమంలో ఆగస్టు చివరి వారంలో యుస్ బృందం ఇక్కడి రానుంది. ఈ నెల 24న అమెరికా ప్రతినిధి బృందం భారత్‌కు రావడంలో ఎలాంటి మార్పు లేదని వాణిజ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్శన అంశంపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి రద్దు సందేశం రాలేదన్నారు. ఆగస్టు 25న ఢిల్లీలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇది భారత్‌పై ఇప్పటికే ఉన్న 25 శాతం టారిఫ్‌తో పాటు అదనంగా 25 శాతం టారిఫ్ అమలు గడువుకు రాకముందు ఈ చర్చలు జరగనున్నాయి.
- Advertisement -