Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నానో ఎరువులు వాడండి.. పర్యావరణాన్ని కాపాడండి

నానో ఎరువులు వాడండి.. పర్యావరణాన్ని కాపాడండి

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి శ్రీజ..
నవతెలంగాణ – మల్హార్ రావు

నానో ఎరువులు అనేవి ఆధునిక వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణని,ఇవి సాంప్రదాయ ఎరువుల మాదిరిగా కాకుండా, నానో టెక్నాలజీ ఆధారంగా తయారవుతాయని వాటి  వాడకం వల్ల నేరుగా పంటనిచ్చే మొక్కలు గ్రహిస్తాయని దీనివల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి బొల్లపెల్లి శ్రీజ అన్నారు. శనివారం మండలంలోని కొయ్యూరు గ్రామంలో గల రైతులకు నానో ఎరువుల వాడకంపై,వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. నానో ఎరువులు అంటే చాలా చిన్న కణాలతో (1 నుండి 100 నానోమీటర్ల పరిమాణంలో) తయారు చేయబడిన ఎరువులుని,ఈ చిన్న కణాలు మొక్కలకు పోషకాలను మరింత సమర్థవంతంగా అందజేస్తాయన్నారు. నానో యూరియా,నానో డిఏపీ ఈ రకమైన ఎరువులకు కొన్ని ఉదాహరణలు. ఈ ఎరువులను సాధారణంగా ద్రవ రూపంలో తయారు చేసి, పంట ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు. ఒక లీటర్ నీటికి మూడు నుంచి నాలుగు మిల్లీలీటర్ల నానో యూరియాను వాడి పిచికారి చేసుకోవాలన్నారు.

నానో యూరియా, నానో డిఏపీల ఉపయోగాల గురించి తెలుపుతూ పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని,సాంప్రదాయ యూరియా, డిఏపీలు వాడినప్పుడు, అందులో పోషకాలు చాలా వరకు భూమిలో వృధా అవుతాయి కానీ నానో ఎరువుల కణాలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల, అవి మొక్కల ఆకుల ద్వారా సులభంగా గ్రహించబడతాయన్నారు. దీనివల్ల పోషకాల వినియోగ సామర్థ్యం 80-90% వరకు పెరుగుతుందన్నారు.ఒక 500 మి.లీ. నానో యూరియా బాటిల్ 45 కిలోల యూరియా బస్తాతో సమానం. అలాగే నానో డిఏపీ కూడా సాంప్రదాయ డిఏపీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందన్నారు. తక్కువ మొత్తంలో ఎరువులు వాడటం వల్ల రైతుల సాగు ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

పర్యావరణానికి మేలు..
సాంప్రదాయ ఎరువుల అధిక వాడకం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే అవకాశం ఉందనీ, నానో ఎరువులు నేరుగా మొక్కలకు అందుతాయి కాబట్టి నేల కాలుష్యం తగ్గి దీనివల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుందనీ అవగాహన కల్పించారు. నానో ఎరువులు మొక్కలకు అవసరమైన పోషకాలను సకాలంలో అందించడం వలన మొక్కల ఎదుగుదల మెరుగుపడి, కిరణజన్య సంయోగక్రియ పెరగడం ఫలితంగా పంట దిగుబడితో పాటు, ధాన్యం నాణ్యత కూడా మెరుగుపడుతుందని తెలిపారు.సాంప్రదాయ ఎరువుల బస్తాలను నిల్వ చేయడం, ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం కష్టం, కానీ నానో ఎరువులు ద్రవ రూపంలో చిన్న బాటిళ్లలో లభిస్తాయి కాబట్టి, వాటిని నిల్వ చేయడం, రవాణా చేయడం చాలా సులభతరంగా ఉంటుందన్నారు. అధిక లాభాలు పొందుతూ, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad