Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ కు యుఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు 

రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ కు యుఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం బీసీ సంఘాల తెలంగాణ రాష్ట్ర బంద్ కు యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి తెలియజేశారు. అనేక సంవత్సరాల నుండి రాజకీయంగా,సామాజికంగా వెనుకబడిన వెనుకబడిన తరగతులు (బీసీలు) ఈరోజు మెజారిటీగా ఉన్నప్పటికీ 42 శాతం రిజర్వేషన్ అమలుకు నోచుకోకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని అన్నారు. అలాగే హైకోర్టు కూడా బీసీ లకు జరుగుతున్న తీవ్ర నష్టాన్ని పరిగణలోకి తీసుకొని 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిపే రకంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే బీసీ లకు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి రేపు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బందుకు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నీ కూడా ఈ బందుకు సహకరించి స్వచ్ఛందంగా విద్యాసంస్థలు బంద్ పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిద్ధల నాగరాజు, నగర కార్యదర్శి పోషమైన మహేష్, నగర నాయకులు వేణు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -