నవతెలంగాణ – మద్నూర్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక మండల నాయకులతో కలిసి మద్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉషా సంతోష్ మేస్త్రిని ఎంపిక చేశారు. మద్నూర్ గ్రామ ప్రజలు ఉషా సంతోష్ మేస్త్రి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రి గారిని గెలిపిస్తే మద్నూర్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రామ సమస్యలు పరిష్కరించడమే గాక ఎల్లప్పుడూ నాకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయించుకుంటారని పేర్కొన్నారు.రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావాహులు ఎవరు కూడా నిరాశపడవద్దని.రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు.పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తానని తెలిపారు.



