Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నానో యూరియా, నానో డిఏపి వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది..

నానో యూరియా, నానో డిఏపి వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది..

- Advertisement -

– దుబ్బాక సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య..
నవతెలంగాణ – తొగుట

నానో యూరియా, నానో డిఏపి వాడడం వల్ల వాతావర ణ కాలుష్యం తగ్గుతుందని దుబ్బాక సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద మాసన్ పల్లి రైతు వేదికలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ, వ్యవ సాయ శాఖ సంయుక్త ఆధ్వర్యం లో నానో యూరియా, నానో డిఏపి వాడకంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఉపయోగించే పొడి యూరియా, డిఏపి మొక్కలకు కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే ఉపయోగ పడుతుందని తెలిపారు.

మిగతాది వృధా అవు తూ నేలలో మరియు గాలిలో కలిసి కాలుష్యం ఏర్పడుతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన వ్యవసాయ సాంకే తికతలో భాగంగా నానో యూరియా, నానో డిఏపి వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించడమే కాకుండా సమర్థవంతమైన ఫలితాలను పొంద వచ్చునని తెలిపారు. ఒక 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ఒక సాంప్రదాయ 45 కిలోల యూరియా బ్యాగుకు సమానమైన పోషకాలను పంటలకు అందిస్తుందని తెలిపారు.

నానో యూరియా ధర మార్కెట్లో 500 మిల్లీ లీటర్ల బాటిల్ కు రూ. 225 వరకు ఉందని చెప్పారు. అధికంగా సాంప్రదాయ యూరియా వాడడం వల్ల పురుగులు, వ్యాధులు పెరిగి పంటకు నష్టం కలిగించడంతో పాటు పర్యా వరణానికి నష్టం జరుగుతుందని వివరించారు. ద్రవరూప నానో ఉత్పత్తులపై మొగ్గు చూపాలని అధికారులు రైతులకు సూచించారు. అనంతరం దుబ్బాక డివిజన్ ఉద్యాన అధికారి రమేష్ మాట్లా డుతూ ఆయిల్ పామ్ పంటలో మెళకువల గురించి తెలిపారు. ఉద్యాన శాఖ రాయితీ పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసా య అధికారి మోహన్, ఇఫ్కో ఏరియా మేనేజర్ చంద్రబాబు, సొసైటీ డైరెక్టర్ నారాయణ్ రెడ్డి, ఏఈ వోలు నాగార్జున, దేవేందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -