ధ్వజస్తంభం ఎక్కిన యాదవులు
నవతెలంగాణ – పాలకుర్తి
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పాలకుర్తి పెద్దగొల్ల సలేంద్ర సోమన్న ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో గల పంచ గుల్ల వద్ద ఉట్లు కొట్టుడు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉట్లు కొట్టుడు కార్యక్రమం తో పాటు ధ్వజస్తంభం ఎక్కడ కార్యక్రమాన్ని వర్షం ఆటంకం కలిగించినప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యాదవులు ఉట్లు కొట్టుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్లు కొట్టుడు కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ధ్వజస్తంభంపై యాదవులు ఏర్పాటు చేసిన కానుకలను తీసుకురావడానికి యాదవ యువకులు కృషి చేశారు.
ధ్వజ స్తంభానికి గ్రీస్ రుద్దడంతో పాటు కింద నల్ల రేగడి మట్టి ఏర్పాటు చేయడంతో వర్షంలో ధ్వజస్తంభం ఎక్కేందుకు యువకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ సాహసం చేశారు. ఒకరి సహాయంతో మరొకరు ధ్వజస్తంభం ఎక్కి ధ్వజస్తంభం పైన యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కానుకలను తీసుకువచ్చారు. ధ్వజస్తంభం ఎక్కిన యువకులను పెద్ద గొల్ల సలేంద్ర సోమన్న అభినందించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు సలేంద్ర సంపత్, సలేంద్ర శ్రీనివాస్, బెల్లి యుగంధర్, బెల్లి కుమార్, చిలువేరు సంపత్, కత్తుల యాకయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా ఉట్ల పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES