పిడిఎస్ యు రాష్ట్ర నాయకులు సంతోష్ నాయక్..
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ , హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేయాలని పిడిఎస్ యు రాష్ట్ర నాయకులు సంతోష్ నాయక్ డిమాండ్ చేశారు. పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఉప్పల గట్టు తండా, రావి చెట్టు బాయి తండా , పోచమ్మ గడ్డ తండా పాఠశాలలో శుక్రవారం విద్యార్థి సంఘ నాయకులు సమస్యల పై సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అజిలాపూర్ గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8 తరగతులకు క్లాసులు చెప్పడానికి హిందీ , ఇంగ్లీష్ , సోషల్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా ఉప్పల గట్టు తండా , రావి చెట్టు బాయి తండా, పోచమ్మ గడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో పెయింటింగ్ వేయించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రామ్, శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.