Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

- Advertisement -

– పశువైద్య అధికారి డాక్టర్ శివకుమార్ 
– మండలంలోని అన్ని గ్రామాలలో నెల రోజులపాటు టీకాలు
నవతెలంగాణ – చారకొండ

గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకా తప్పనిసరి వేయించాలని పాడి రైతులకు పశువైద్య అధికారి డాక్టర్ శివకుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ, చారకొండ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో నేడు అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 శుక్రవారం వరకు నెలరోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు,4నెలలు దాటిన దూడలకు, గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ కొరకై గాలికుంటు వ్యాక్సిన్”టీకాలు ఇస్తామని తెలిపారు. పశువులకు టీకాలు వేయించుకోవాలని పాడి రైతులకు సూచించారు, పశువులు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -