Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమానవ్వించే 'ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు'

నవ్వించే ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’

- Advertisement -

వడ్డే నవీన్‌ హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద కమల్‌ తేజ నార్ల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వడ్డే నవీన్‌కి జోడీగా రాశి సింగ్‌ నటిస్తున్నారు.
విజయ మాధవి కంబైన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్‌ తండ్రి నిర్మాత వడ్డే రమేష్‌ పెద్ద పెద్ద స్టార్లతో చిత్రాలు నిర్మించి, మంచి విజయాలను సాధించారు. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ కొనసాగింపుగా వడ్డే క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ని స్థాపించారు. అందులో భాగంగానే మొదట చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్‌తో 80 శాతం పూర్తయ్యింది. తాజాగా రిలీజ్‌ చేసిన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. కామెడీ యాంగిల్‌లో వడ్డే నవీన్‌ అందర్నీ నవ్వించబోతున్నారని ఫస్ట్‌లుక్‌ చెప్పకనే చెప్పింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు : కళ్యాణ్‌ నాయక్‌, స్టోరీ, స్క్రీన్‌ ప్లే : కమల్‌ తేజ నార్ల, వడ్డే నవీన్‌, ఎడిటింగ్‌ : విజరు ముక్తావరపు, కెమెరామెన్‌ : కార్తిక్‌ సుజాత సాయికుమార్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img