Saturday, December 13, 2025
E-PAPER
Homeఆటలువైభవ్‌ సూర్యవంశీ నయా చరిత్ర

వైభవ్‌ సూర్యవంశీ నయా చరిత్ర

- Advertisement -

14సిక్సర్లతో మెరిసిన యువ సంచలనం
యుఎఇపై 234పరుగుల తేడాతో భారత్‌ గెలుపు

అండర్‌-19 ఆసియాకప్‌ టోర్నీ

దుబాయ్‌: అండర్‌-19 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారతజట్టు శుభారంభం చేసింది. 14ఏళ్ల యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ యుఎఇపై 14సిక్సర్లు కొట్టి రికార్డుపుటల్లోకెక్కగా.. ఓవరాల్‌గా 171పరుగులతో రాణించడంతో భారతజట్టు 234 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. శుక్రవారం నుంచి ప్రారంభమైన అండర్‌-19 ఆసియాకప్‌ టోర్నీలో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో యుఎఇ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7వికెట్లు కోల్పోయి 199పరుగులే చేసింది. దీంతో భారతజట్టు 234 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సూర్యవంశీకి లభించింది. ఇక 14ఏళ్ల సూర్యవంశీ కేవలం 56బంతుల్లో సెంచరీతో కొట్టిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 95బంతుల్లో 9ఫోర్లు, 14సిక్సర్లతో 171పరుగులు చేశాడు. 30బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన సూర్యవంశీ.. మరో 26బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అత్యధిక పరుగులు కొట్టిన బ్యార్‌ అంబటి రాయుడు(177పరుగులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేయలేకపోయాడు. 2002 యూత్‌ గేమ్స్‌లో అంబటి రాయుడు తొలుత ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ ఏడాది జులైలో ఇంగ్లండ్‌పై 143పరుగులతో రాణించిన సూర్యవంశీ.. యూత్‌ వన్డేల్లో కొట్టిన రెండో శతకం ఇది. గత నెలలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలోనూ సూర్యవంశీ సెంచరీతో మెరిసాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -