నవతెలంగాణ-పాలకుర్తి
వైద్య విధాన పరిషత్ ల పనిచేస్తున్న ఉద్యోగులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు చెల్లించాలని వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెండెంట్ డాక్టర్ పరమేశ్వరికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు అందజేశారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హెడ్ నర్స్ సుహాసిని మాట్లాడుతూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు జీరో వన్ జీరో ద్వారా నేరుగా వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం దృష్టి సాధించాలని తెలిపారు. వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ సంకల్పనలో భాగంగా సెకండరీ హెల్త్ సర్వీసెస్ అలోపేతం చేసేందుకు ఖాళీలను భర్తీ చేసి సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, నర్సింగ్ ఆఫీసర్లు విజయశాంతి,కవిత,తరుణ్ , ఫార్మాసిస్టు,సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు జీరో వన్ జీరో ద్వారా వేతనాలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



