Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశానుసారoగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్)  కె.రామచంద్ర రావు ఆద్వర్యంలో శ్రీ మహార్షి వాల్మీకి జయంతి కార్యాక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహర్షి వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించడం జరిగింది. అనంతరం అదనపు పోలీస్ కమిషనర్ కె.రామచంద్ర రావు  మాట్లాడుతూ.. శ్రీ మద్రామాయణ మహాకావ్య సృష్టికర్త మహార్షి వాల్మీకి అనియు, ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి, సప్త ఋషుల బోధనల ద్వారా మహార్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహానీయుడు వాల్మీకి అనియు, మనము అందరమూ ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆదర్శవంతమైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను, రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని తెలియజేశారు.

ఈ జయంతి సందర్భంగా ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్ అహ్మద్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ లు  శ్రీనివాస్, తిరుపతి, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వీరయ్య, పోలీస్ కార్యాలయం సిబ్బంది,సి.సి.ఆర్.బి, సి.ఎస్.బి, ఐ.టి కోర్ , పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -