Monday, October 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్వాల్మీకి నగర్ లో వాల్మీకి జయంతి

వాల్మీకి నగర్ లో వాల్మీకి జయంతి

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్    
పట్టణంలోని వాల్మీకి నగర్ కాలనీవాసులు వాల్మీకి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కొమురం భీం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలయెహో నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గాలి నర్సింగ్, జెట్టి నారాయణ, ఎల్లుళ్ల సునిల్ మాట్లాడుతూ.. హిందువులందరూ ఆదర్శమూర్తిగా భావించే శ్రీరాముని చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన వాల్మీకి మహర్షి పేరు తమ కాలనీకి పెట్టుకున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇకముందు కూడా ప్రతి సంవత్సరం వాల్మీకి జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేలా కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఎల్లుళ్ల అనిల్, చెదల శ్రీనివాస్, సహరే మహేష్,స్వామి, రాజు, ఎల్మెల్వార్ అనిల్, బగన్వార్ హరి, ఠాకూర్ సోనాల్, సాయి, సూరజ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -