Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ఎంసీపీఐ(యూ) అభ్యర్థిగా వనం సుధాకర్‌

జూబ్లీహిల్స్‌ ఎంసీపీఐ(యూ) అభ్యర్థిగా వనం సుధాకర్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) బలపరిచిన ఎంసీపీఐ(యూ) అభ్యర్థిగా వనం సుధాకర్‌ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, బీఎల్‌ఎఫ్‌ చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వనం సుధాకర్‌ ప్రస్తుతం ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజాగొంతుకగా ఆయన్ను అసెంబ్లీకి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజలు గెలిపించి పంపాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -