అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వానర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన ఈ మూవీ ఇయర్ ఎండ్ హాలీడే సీజన్‌లో ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు థియేటర్స్‌లోకి రాబోతోంది అని చిత్రయూనిట్ తెలిపింది.
‘వానర’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



