No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంఏసీబీ వలలో వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ వలలో వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌

- Advertisement -

– ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విషయంలో రూ.లక్ష డిమాండ్‌
– రూ.70 వేలకి సెటిల్మెంట్‌
– డాక్యుమెంట్‌ రైటర్‌ సహా ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌


నవతెలంగాణ – వనస్థలిపురం
వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో లంచం వ్యవహారం బహిర్గతమైంది. ఓ ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం లక్ష రూపాయలు డిమాండ్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీ వలలో చిక్కారు. వివరాల్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్‌ విషయంలో ఓ వ్యక్తినిసబ్‌ రిజిస్ట్రార్‌ రాజేష్‌కుమార్‌ లక్ష రూపాయలు డిమాండ్‌ చేయగా.. చివరికి రూ. 70 వేలకు ఒప్పందం జరిగింది. ఆ తర్వాత బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో శుక్రవారం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సూచన మేరకు బాధితుడు రూ.70 వేలను డాక్యుమెంట్‌ రైటర్‌ వద్ద టైపిస్టుగా పనిచేస్తున్న రమేష్‌కు అందించగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రమేష్‌ను ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధమూ లేదని, సబ్‌ రిజిస్ట్రార్‌ సూచన మేరకే డబ్బులు తీసుకున్నానని అంగీకరించాడు. వెంటనే ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. గతంలో కూడా ఈ సబ్‌ రిజిస్ట్రార్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, తగిన సాక్షాలు లేకపోవటంతో చర్యలు తీసుకోలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా లంచం కోసం డిమాండ్‌ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad