- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కార్మేల్ స్కూల్ లో శుక్రవారం వందేమాతరం గేయం 150 సంవత్సరాల ఉత్సవంలో భాగంగా విద్యార్థులు వందేమాతరం అక్షరాల్లో ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. అదేవిధంగా సామూహికంగా వందేమాతరం గేయం ఆలపించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గేయం ఇచ్చిన స్పూర్తి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
- Advertisement -



