జిల్లా కలెక్టర్ హనుమంతరావు…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7న (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆ గీతాన్ని సామూహిక గానం చేయడం జరుగుతుందని కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.
ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో ఉదయం 10.00 గంటలకు వందేమాతరం సామూహిక గీతాలాపన ఉంటుందని అన్నారు. కలెక్టరేట్ సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో “వందే మాతరం” గీతాన్ని సామూహికంగా ఆలపించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు, భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విధిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో కూడా ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.



