Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యాలయాల్లో వందేమాతరం పాడలేదు

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యాలయాల్లో వందేమాతరం పాడలేదు

- Advertisement -

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ : స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150ఏండ్లు పూర్తయ్యాయిన సందర్భంగా శుక్రవారం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి ఈ పాట ప్రసిద్ధ నినాదం. అయినప్పటికీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ కార్యాల యాల్లోగానీ, శాఖల్లోగానీ ఈ గేయాన్ని పాడలేదు. సొంత గ్రంథాల్లో నూ, సాహిత్యంలోనూ ఈ పాటను పొందుపరచలేదు అలాంటిది ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ గేయ 150వ స్మారకోత్సవాలు జరుపుతున్నా యని ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ గీతం కంటే ‘నమస్తే సదా వత్సల పాడటానికే ఇష్టపడిందని ఆయన తన ప్రకటనలో ఎత్తిచూపారు.

”కాంగ్రెస్‌ పార్టీ 1986 నుంచి నేటి వరకు ప్రతి సమావేశం, ప్లీనరీ, బ్లాక్‌స్థాయి సమావేశం ఏదైనా వందేమాతరం పాటను ఆలపిస్తోంది. నేడు జాతీయవాద సంరక్షకులమని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు తమ శాఖల్లోగానీ లేదా కార్యాలయాల్లో గానీ వందేమాతరం లేదా మన జాతీయ గీతం జనగణ మనను ఎప్పుడూ పాడకపోవడం విడ్డూరం. వాటికి బదులుగా వారు దేశాన్ని కాదు.. వారి సంస్థల్ని కీర్తిస్తూ నమస్తే సదా వత్సల అనే పాటను పాడుతున్నారు. 1925లో స్థాపించినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సార్వత్రిక గౌరవం ఉన్నప్పటికీ వందేమాతరాన్ని నిరాకరించింది. ఈ పాటను ఆర్‌ఎస్‌ఎస్‌ స్వీకరించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రంథాలలో లేదా సాహిత్యంలో ఒక్కసారి కూడా ఈ పాట ప్రస్తావన కనిపించదు” అనివిమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -