Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'వీర చంద్రహాస' రిలీజ్‌కి రెడీ

‘వీర చంద్రహాస’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ, ‘కన్నడలో విడుదలైన ‘వీర చంద్రహాస’ చిత్రం హిట్‌ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది.ఈ మూవీ తెలుగు రైట్స్‌ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ‘మహాభారతం’లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి గొప్ప కథను చెబుతుంది. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.
తనదైన సంగీతంతో అందర్నీ మెప్పించిన రవి బస్రూర్‌ దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది. ఇటీవల విడుదలైన ‘మహావతార్‌ నరసింహ’ చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని బలంగా నమ్ముతున్నాం’ అని అన్నారు.
‘డైరెక్టర్‌గా నేను రూపొందించిన ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమ్‌వీ రాధాకృష్ణ మా చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని సంగీత దర్శకుడు, దర్శకుడు రవి బస్రూర్‌ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad