Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగొర్రెలపైకి దూసుకొచ్చిన వాహనం

గొర్రెలపైకి దూసుకొచ్చిన వాహనం

- Advertisement -

– 70 గొర్రెలు మృత్యువాత
– వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలంలో ఘటన
– సుమారు రూ.10లక్షల వరకు ఆస్తి నష్టం


నవతెలంగాణ-కొడంగల్‌
రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి గుర్తు తెలియని వాహనం అతివేగంగా దూసుకెళ్లగడంతో 70 మూగ జీవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొరరాస్‌పేట్‌ మండలం నాందర్‌పూర్‌ గ్రామానికి చెందిన కాపరులు ఎల్లప్ప, మల్కప్ప గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి జాతీయ రహదారి-163 పక్కన గొర్రెల మందను పెట్టి, వారు అక్కడే కాపలాగా పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మందలోని కొన్ని గొర్రెలు రోడ్డుపైకి వెళ్లాయి. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం గొర్రెలను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో 70 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కాపరులు నిద్ర లేచే సరికే రోడ్డుపై గొర్రెలు విగతా జీవులపై పడి ఉన్నాయి. వాటిని చూసి బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. గొర్రెలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అవి మృత్యువాత పడటంతో తాము రోడ్డున పడ్డామని లబోదిబోమంటున్నారు. సుమారు రూ.10లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన గొర్రెలను ట్రాక్టర్‌లో తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి :
యాదవ సంఘం నాయకులు మధుసూదన్‌యాదవ్‌
రోడ్డు ప్రమాదంలో 70 గొర్రెలు మృత్యువాత పడటం బాధాకరం. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని యాదవ సంఘం కొడంగల్‌ తాలూకా అధ్యక్షులు మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. మల్కప్ప, ఎల్లప్ప గొర్రెల పెంపకంతో కుటుంబాలను పోషించుకుం టున్నారని, అప్పులు చేసి గొర్రెలు కొన్నారని తెలిపారు. గొర్రెలు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad