Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపీసీఐ పాలకమండలి సభ్యులుగా వెంకటరమణ

పీసీఐ పాలకమండలి సభ్యులుగా వెంకటరమణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ఆజాద్‌ ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ముప్పవరపు వెంకటరమణ న్యూఢిల్లీలోని ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) కేంద్ర పాలకమండలి సభ్యులుగా నియమితులయ్యారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తరఫున ఆయనను పీసీఐ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. వెంకటరమణ ఇప్పటికే ఐదేండ్ల నుంచి పీసీఐ కేంద్ర కార్యవర్గ సభ్యులుగా సేవలను అందిస్తున్నారు. తాజాగా ఆయన్ను రెండోసారి పీసీఐ సభ్యులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2030, జూన్‌ 17వ తేదీ వరకు అంటే ఐదేండ్లపాటు ఆయన ఈ బాధ్యతల్లో ఉంటారు. ముప్పవరపు వెంకటరమణ సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందినవారు. తెలంగాణ ఫార్మసీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆయనకు అభినందనలు తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad