Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సుదర్శన్ రెడ్డిని కలిసిన వేణుగోపాల్ యాదవ్

సుదర్శన్ రెడ్డిని కలిసిన వేణుగోపాల్ యాదవ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ( ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు) గా క్యాబినెట్ హోదాతో నియమితులైన బోధన్ ఎమ్మెల్యే, 
మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డినీ మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శుక్రవారం  సుదర్శన్ రెడ్డిని తన నివాసంలో కలిసి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారులుగా నియామకమైనందుకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డిని బాస వేణుగోపాల్ యాదవ్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు. కార్యక్రమంలో డిసిసి డెలిగేట్ తక్కురీ దేవేందర్, వెంకన్న నాయక్,  మహమ్మద్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -