Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంభారత ఉప రాష్ట్రపతి రాజీనామా

భారత ఉప రాష్ట్రపతి రాజీనామా

- Advertisement -

అనారోగ్య కారణాలతో జగదీప్‌ ధన్కర్‌ రిజైన్‌
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ
పదవీ కాలం మరో రెండేండ్లు ఉండగానే నిర్ణయం
న్యూఢిల్లీ :
భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌(74) రాజీనామా చేశారు. తన పదవీ కాలం మరో రెండేండ్లు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో, వైద్య సూచనల మేరకు రాజీనామా చేస్తున్నట్టు అనారోగ్య కారణాలతో జగదీప్‌ ధన్కర్‌ రిజైన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పదవీ కాలం మరో రెండేండ్లు ఉండగానే నిర్ణయం ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించారు. తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, పార్లమెంటు సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన పదవీ కాలంలో చాలా నేర్చుకున్నట్టు వివరించారు. దేశ ఉజ్వల భవిష్యత్తుపై చాలా విశ్వాసం ఉన్నదని జగదీప్‌ ధన్కర్‌ తన రాజీనామా లేఖలో వివరించారు. ఈ మేరకు భారత ఉపరాష్ట్రపతి ఎక్స్‌ ఖాతా.. రాష్ట్రపతికి ఆయన పంపిన లేఖను పోస్ట్‌ చేసింది. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్కర్‌.. తన పదవికి రాజీనామా చేయటం గమనార్హం.

జగదీప్‌ ధన్కర్‌.. 2022, ఆగస్టు 11న భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2027 వరకు ఆయన పదవీ కాలం ఉన్నప్పటికీ.. దానికి రెండేండ్ల ముందే రాజీనామా చేశారు. ఆయన అంతకముందు 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా పని చేశారు. 2019-22 వరకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఆయన సేవలందించారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయనకు, అక్కడి మమతా బెనర్జీ సర్కారు మధ్య తరచూ విభేదాలు తలెత్తాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌గా జగదీప్‌ ధన్కర్‌ను నియమించి కావాలనే రాజకీయాలు చేస్తోందన్న విమర్శలు ఆ మధ్య ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తాయి. అయితే గవర్నర్‌గా ఉన్న ఆయనను.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో గల ఎన్డీయే ప్రభుత్వం ఉపరాష్ట్రపతిని చేయటం గమనార్హం. ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయన.. రాజ్యసభ చైర్మెన్‌గా కూడా పని చేశారు. సభలో ఆయన వ్యవహారశైలిపై ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా పలు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీకి అనుకూలంగా ఆయన వ్యవహారముండేదని విమర్శలూ వారి నుంచి వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -