- Advertisement -
నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి న్యూఢిల్లీలో హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీని బుధవారం కలిశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలీట్ బ్యూరో సభ్యులు బివి రఘవులు, ఆర్.అరుణ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు జస్టీస్ బి.సుదర్శన్ రెడ్డి సీపీఐ ప్రధాన కార్యలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజాను కలిశారు.


- Advertisement -