Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయం చేయాలని ఏసీపీని వేడుకున్న బాధితురాలు 

న్యాయం చేయాలని ఏసీపీని వేడుకున్న బాధితురాలు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటుండగా కొందరు అడ్డుపడుతున్నారని, వారి నుండి కాపాడేందుకు న్యాయం చేయాలని మండలంలోని తొర్రూరు గ్రామానికి చెందిన గుర్రం వెంకటమ్మ బుధవారం వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య ను వేడుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లును తన సొంత స్థలంలో నిర్మించుకుంటున్నానని తెలిపారు. కొంతమంది కావాలని ఇల్లు నిర్మాణం చేయకుండా అడ్డుపడుతున్నారని, మనస్తాపం చెంది పురుగుల మందు తాగానని, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. స్పందించిన ఏసిపి రెండు రోజుల్లో తొర్రూరు గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరిస్తానని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ వంగాల జానకిరామ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -