నవతెలంగాణ- సదాశివ నగర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ అన్నారు. ఆదివారం సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా, యాచారం, సజ్యనాయక్ తండా, పూర్య నాయక్ తండా లలో పర్యటించి వరద బీభత్సానికి కుంటల అలుగులు తెగి గిరిజన రైతుల పంట పొలాలలో మట్టి ఇసుక కుప్పలు కుప్పలుగా పేరుక పోయి తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. విపత్తు వలన నష్టపోయిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు పొలాలలో పేరుక పోయిన మట్టిని రాళ్ళను తీయాలంటే చాలా ఖర్చు అవుతుందని, రైతు పంట నష్టంతో పాటు ఈ ఖర్చును భరించలేరు కాబట్టి ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారంగా ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బాధితులకు నష్టపరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES