నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9న కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, అప్పటి ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన రోజు అని భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో బి ఆర్ ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తా నుండి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులందరినీ స్మరించుకొని వారికి నివాళులర్పించడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గ్రంథాలయ సంస్థ ల జిల్లా మాజీ చైర్మన్ జడల అమరేందర్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, కొట్టాను అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ బిఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విజయ దివస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


