నవతెలంగాణ-మర్రిగూడ
మొదటి విడతలో భాగంగా డిసెంబర్ 11 బుధవారం మండల వ్యాప్తంగా గ్రామపంచాయితీ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మండలంలోని 18 గ్రామపంచాయితీలకు 2 గ్రామ పంచాయతీలకు సర్పంచులు,170 వార్డులకు 30 వార్డులు ఏకగ్రీవం అయ్యారు. ఇక మిగిలిన 16 గ్రామ పంచాయతీలకు,140 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ అనంతరం గత కొన్ని రోజులుగా ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచ్,వార్డు మెంబర్ అభ్యర్థులు పలు రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు.మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడంతో మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో పలు పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు భారీ స్థాయిలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు మరియు స్వతంత్ర సర్పంచ్ మరియు వార్డు అభ్యర్థులు,గ్రామస్తులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో జోరుగా ప్రచారాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



