నవతెలంగాణ హైదరాబాద్: నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నా పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు దాదాపు ఖాయం అయిపోయింది. శుక్రవారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహానికి ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ – రష్మిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇద్దరు అధికారికంగా స్పందించకున్నా.. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్ట్‌లతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు.