- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్ష ఫలించిన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ‘విజయ్ దివస్’ వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంబరాలు చేపట్టాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు.ఈ క్రమంలోనే డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దీక్ష ఫలించిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
- Advertisement -



