– రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో సంబురాలు : కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కీలక మలుపు తిప్పిన డిసెంబర్ 9ని విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు అదివారం పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వారికి దిశానిర్దేశం చేశారు. నవంబర్ 29న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేసినట్టే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా వేడుకలు నిర్వహించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ దీక్ష ఫలవంతమైన నిమ్స్‌తో పాటు గాంధీ ఆస్పత్రిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
డిసెంబర్ 9న ఘనంగా ‘విజయ్ దివస్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



