Tuesday, January 13, 2026
E-PAPER
Homeఆటలువిజయ్ హజారే ట్రోఫీ... దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

విజయ్ హజారే ట్రోఫీ… దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో రెండు సీజన్‌లలో 700 పరుగుల చొప్పున చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కర్ణాటక బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ రికార్డు పుటల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్న పడిక్కల్, సోమవారం ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 95 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్‌లో 721 పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో పడిక్కల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

అంతకుముందు 2020-21 సీజన్‌లో కూడా పడిక్కల్ 7 మ్యాచ్‌లలో 737 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో ఒకే ఎడిషన్‌లో 700 పరుగుల మార్కును అధిగమించిన వారిలో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, దేవదత్ పడిక్కల్, నారాయణ్ జగదీశన్, కరుణ్ నాయర్ ఉన్నారు. ఇప్పుడు పడిక్కల్ రెండో సీజన్‌లోను 700 పరుగులు చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆయా సీజన్‌లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో నారాయణ్ జగదీశన్ (2022-23 సీజన్) 830 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత పృథ్వీషా 827 (2021-22 సీజన్), కరుణ్ నాయర్ 779 (2024-25 సీజన్), దేవదత్ పడిక్కల్ 737, మయాంక్ అగర్వాల్ 723, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత సీజన్‌లో 721 పరుగులతో కొనసాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -