- Advertisement -
నవతెలంగాణ – హైదరబాద్: టీవీకే చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాలను విజయ్ అక్టోబర్ 27న చెన్నై దగ్గర్లోని ఓ రిసార్ట్‌లో కలవనున్నారు. ఇప్పటికే రిసార్ట్‌లో 50 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపాయి.
- Advertisement -



