Sunday, August 3, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రధాని మోడీ వల్లే గ్రామాల అభివృద్ధి

ప్రధాని మోడీ వల్లే గ్రామాల అభివృద్ధి

- Advertisement -

నవతెలంగాణ – భైంసా
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి అన్నారు. ఆదివారం భైంసా మండలంలోని దేగాం గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అదేశాను సారం బీజేపీ జనసంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. మోడీ పాలనకు విశేష స్పందన లభిస్తుందన్నారు.

అదేవిధంగా నియోజకవర్గంలో గత 18 నెలల కాలంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తేవడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీజేపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలిశారు. కేంద్రం ప్రజానీకానికి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో బూత్ ఇంచార్జి లు పాతర్ల నరేష్, పోల్కం సాయినాథ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -