Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్దే తన లక్ష్యం

గ్రామ అభివృద్దే తన లక్ష్యం

- Advertisement -

– కమ్మర్ పల్లి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వీనిల ప్రదీప్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గ్రామ అభివృదే తమ లక్ష్యం ప్రజలకు సేవలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కమ్మర్ పల్లి సర్పంచ్ అభ్యర్థి వీనిల ప్రదీప్ అన్నారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాభివృద్ధే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రతి కుటుంబం అభ్యున్నతే లక్ష్యంగా కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామ పురోగతికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు, సమాధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.ప్రజల ఆశీర్వాదమే నా బలం,మీ నమ్మకాని కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రచారంలో ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూర్  గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు దూలురి కిషన్ గౌడ్, సుంకేట శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -