Sunday, June 8, 2025
E-PAPER
Homeఖమ్మంగ్రామ విద్యా రిజిష్టర్ నమోదు.. 

గ్రామ విద్యా రిజిష్టర్ నమోదు.. 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : “బడిబాట” లో భాగంగా అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పాఠశాలల్లో గ్రామ విద్యా రిజిస్టరు నమోదు ప్రక్రియను నిర్వహించారు. ప్రతి పాఠశాల పరిధిలో ఇంటింటికి వెళ్లి బడీడు పిల్లలను, బడి బయటి పిల్లలను గుర్తించి వారి వివరాలను నమోదు చేశారు. పిల్లలు  ఏ పాఠశాలలో చదువుతున్నారు వంటి వివరాలను నమోదు చేశారు. నమోదు ప్రక్రియను మండల విద్యాధికారి పి. ప్రసాదరావు, కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత పరిశీలించారు. చిన్నంశెట్టి బజారులో నమోదు ప్రక్రియను సందర్శించిన మండల విద్యాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ.. పాఠశాల నిర్వహణకు గ్రామ విద్యా రిజిస్టరు ముఖ్యమైనదని హ్యాబిటేషన్ లోని మొత్తం వివరాలను నమోదు చేయాలని అన్నారు. కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడుతూ.. బడి బయటి పిల్లలను కూడా బడిలో నమోదు చేయించాలని అన్నారు.  బడిబాట కరపత్రాన్ని అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యయురాలు హరిత ఆవిష్కరించారు. మార్చి 2025 – 10వ, తరగతి ఫలితాల వివరాలతో పాటు పాఠశాలలో విద్యార్ధులకు అందిస్తున్న సౌకర్యాలను తెలియచేస్తూ కరపత్రాన్ని ముద్రించారు. కరపత్రాలను ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారంలో తల్లిదండ్రులకు పంచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -