Thursday, January 8, 2026
E-PAPER
Homeజిల్లాలుసీసీరోడ్ల నిర్మాణం పట్ల గ్రామస్థుల హర్షం

సీసీరోడ్ల నిర్మాణం పట్ల గ్రామస్థుల హర్షం

- Advertisement -

నవతెలంగాణ – మెండోర
సంవత్సరాల తరబడి నివాస గృహాలకు సిసి రోడ్లు నిర్మాణాల కొరకు ఎదురుచూసినా నిర్మాణం కాని రోడ్లు ఇన్నాళ్లకు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో రోడ్లు నిర్మాణాల పనులు పరిష్కారం కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సావెల్ గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామంలో మట్టి రోడ్లతో ప్రజలు నరకయాతన పడేవారు. సుదీర్ఘ కాలంగా పడి ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కంకణం కట్టుకుని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తున్నారు.

ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన నిధులతో దశల వారీగా గ్రామంలో సిసి రోడ్లు , డ్రైనేజీలు , అంతర్గత డ్రైనేజీలు , స్ట్రీట్ లైట్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న మా సమస్యలు ఇన్నాళ్లకు పరిష్కారం అయ్యాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ముత్యాల సునీల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -