Monday, December 8, 2025
E-PAPER
Homeజిల్లాలుశబ్ద కాలుష్యంతో గ్రామస్తులు ఆందోళన

శబ్ద కాలుష్యంతో గ్రామస్తులు ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ-సదాశివ నగర్: మండలంలోని లింగంపల్లి జనగామ కరడ్ పల్లి గ్రామాల మధ్య తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ వల్ల జనగాం కరడ్ పల్లి లింగం పల్లి గ్రామాలలో శ్రద్ధ కాలుష్యం భరించలేకపోతున్నామని గ్రామస్తులు తెలిపారు. పచ్చని పల్లెల్లో శబ్ద కాలుష్యము ప్రస్తుతం దుర్వాసన ప్రారంభం కాలేదు. ఇప్పుడే శబ్ద కాలుష్యంతో గ్రామస్తులకు కంటిమీద నిద్ర లేకుండా పోతుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శబ్ద కాలుష్యాన్ని నివారించాలని కోరుతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉఃటుందో అని ఆందోళన చెందుతున్నారు. పచ్చని పల్లెల్లో ప్రజలు నివసిస్తారా లేకుంటే గ్రామాలు కాలి చేసి దూరపాంతలకు వెళ్తారని ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -