Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రోడ్డుపై బైఠాయించిన ఐలాపూర్ గ్రామస్తులు 

రోడ్డుపై బైఠాయించిన ఐలాపూర్ గ్రామస్తులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
నందిపేట్ మండలం లోని ఐలాపూర్ గ్రామ శివారులోని భూములు ఆక్రమణకు గురవుతున్నాయని గురువారం గ్రామస్తులు రోడ్డు పై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఐలాపూర్ గ్రామనికి సంబంధించిన 172 సర్వే నంబరు గల భూమిని ఆంధ్రనగర్ గ్రామానికి చెందిన  ఒక వ్యక్తి 4 ఎకరాలు భూమిని కబ్జా చెయ్యడం జరిగిందన్నారు. ఇతనికి  గతంలో గుత్ప ఎత్తిపోతల కెనాల్ కోసం కోసం తనకు ఉన్న భూమిలో ఎకరం 20 గంటల భూమి పోవడంతో ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని అన్నారు. ఇప్పుడు ఐలాపూర్ గ్రామ శివారులోని భూమిని చదును చేసి వరి పంట వెయ్యడం జరిగిందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు అతని పై చర్యలు తీసుకోవాలని విన్నవించినా స్పందించలేదని తెలిపారు. విసుగు చెంది ఈరోజు గ్రామంలో రోడ్డు పై బైటాయించి ఆందోళనకు దిగినట్లు గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా కబ్జా చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై శ్యామ్ రాజ్  విచ్చేసి పరిస్థితిని పర్యవేక్షించినారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad